Palnadu Dist.: సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో కలకలం..
ABN, First Publish Date - 2022-12-31T16:18:52+05:30
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో కలకలం రేగింది. గుర్తుతెలియని ఓ మహిళా శిశువును అపహరించేందుకు యత్నించింది.
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి (Sattenapally) ఏరియా ఆసుపత్రి (Area Hospital)లో కలకలం రేగింది. గుర్తుతెలియని ఓ మహిళా శిశువును అపహరించేందుకు యత్నించింది. ఆస్పత్రిలో శిశువును ఎత్తుకెళ్ళేందుకు మాస్క్ వేసుకుని వచ్చిన మహిళా.. శిశువును తీసుకుని వెళ్తుండగా.. పక్క బెడ్‌లో ఉన్న పెషంట్లు అప్రమత్తమయ్యారు. ఆ మహిళను నిలదీశారు. దీంతో ఆ మహిళ ఆస్పత్రి గేటు వద్ద బిడ్డను వదిలి పరారైంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి వర్గాలు మహిళా ఆచూకీ కోసం సీసీ ఫుటేజ్ (CC Footage)ను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2022-12-31T16:18:54+05:30 IST