AP News.. ప్రభుత్వం మారితే ఎవ్వరిని వదిలిపెట్టం: యారపతినేని
ABN, First Publish Date - 2022-12-21T13:05:50+05:30
మాచర్ల (Macherla) ఘటనకు సంబంధించి నియోజకవర్గంలో పలువురు టీడీపీ (TDP) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని యారపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasa Rao) అన్నారు.
పల్నాడు జిల్లా: మాచర్ల (Macherla) ఘటనకు సంబంధించి నియోజకవర్గంలో పలువురు టీడీపీ (TDP) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని యారపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasa Rao) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి కేసులు లేకపోయినా అక్రమంగా పోలీసులు తీసుకెళ్ళారన్నారు. దుర్గి, నాగార్జున సాగర్ స్టేషన్లలో వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, ఎమ్మెల్యే పిన్నెల్లి చెప్పినట్లు పోలీసులు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మారితే ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇప్పడు అక్రమాలకు పాల్పడే పోలీసులు రేపు నిందితులుగా మారతారన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీడీపీకి విజ్ఞప్తి చేశామన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని యారపతినేని శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.
Updated Date - 2022-12-21T13:05:54+05:30 IST