ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Peetala Sujatha: దారుణాలు పెరిగిపోతుంటే దిశాచట్టం ఏమైంది?

ABN, First Publish Date - 2022-11-22T17:15:02+05:30

Amaravathi: రాష్ట్రంలో రోజురోజుకు దారుణాలు ఎక్కువైపోతున్నాయని టీడీపీ (TDP) నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) నిర్లక్ష్య పాలనే అందుకు కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి నరసాపురం (Narasapuram) బహిరంగసభకు కొందరు యువతులు నల్ల చున్నీలు ధరించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: రాష్ట్రంలో రోజురోజుకు దారుణాలు ఎక్కువైపోతున్నాయని టీడీపీ (TDP) నేత పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) నిర్లక్ష్య పాలనే అందుకు కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి నరసాపురం (Narasapuram) బహిరంగసభకు కొందరు యువతులు నల్ల చున్నీలు ధరించి వచ్చారు. సభలో వారు వాటితో నిరసన తెలుపుతారన్న అనుమానంతో పోలీసులు చున్నీలను తీసేయించారు. ఈ చర్యపై పీతల సుజాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చున్నీలను తొలగించడమంటే ఆడ బిడ్డలను అవమానించినట్టు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై 52వేలకుపైగా నేరాలు జరిగాయని ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొనడం వైసీపీ పాలన తీరుకు అద్ధం పడుతుందన్నారు. ఎన్సీఆర్‌బీ నివేదికపై ముఖ్యమంత్రి, మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తల్లుల పెంపకం సరిగాలేదని.. యాథృచ్ఛికంగా రేప్‌లు జరుగుతాయని మంత్రులు వ్యాఖ్యానించడం ఆడబిడ్డల్ని అవమానించడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరుగుతుంటే దిశాచట్టం ఏమైంది? ప్రశ్నించారు. మహిళల్ని వేధించినా, వారినేం చేసినా ముఖ్యమంత్రి కాపాడతారన్న నమ్మకం, ధైర్యంతోనే కామాంధులు పేట్రేగిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ కుట్రపూరిత చట్టాలవల్లే ఆక్వారంగం నిర్వీర్యంమైందని ఆరోపించారు.

Updated Date - 2022-11-22T17:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising