Former JD Lakshminarayana: ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-11-24T16:41:16+05:30
ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former JD Lakshminarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నాయని తప్పుబట్టారు.
కాకినాడ: ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former JD Lakshminarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నాయని తప్పుబట్టారు. అప్పులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలపై ఇన్వెస్టర్లు (Investors) ఆసక్తి చూపరని తెలిపారు. అందుకే మన రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్టర్లు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పనిసరిగా విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ తరఫున పోటీ చేయాలన్న దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నానని తెలిపారు. ఏ పార్టీ తరపున పోటీ చేయకపోతే ఇండిపెండెంట్ (Independent)గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. మునుగోడు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెడతారా అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదు అనే నిబంధనలు రావాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Updated Date - 2022-11-24T16:47:15+05:30 IST