GVL: జయహో బీసీ కాదు.. భయహో బీసీ సభ పెట్టాలి
ABN, First Publish Date - 2022-12-07T14:58:19+05:30
బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నామని బీసీ సభ పెట్టారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.

న్యూఢిల్లీ: బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నామని బీసీ సభ పెట్టారని బీజేపీ ఎంపీ జీవీఎల్ (BJP MP GVL) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జయహో బీసీ కాదు.. భయహో బీసీ సభ పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. నిధులు, వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను మోసం చేశారని విమర్శించారు. 50 శాతం పైగా ఉన్న బీసీలకు వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత, పద్మశాలి, యాదవులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. అలంకార ప్రియమైన పదవులతో బీసీలకు ఒరిగింది ఏమి లేదని అన్నారు. వైసీపీ భయభ్రాంతులకు గురి చేసిన బీసీలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే భవిష్యత్‌లో బీసీలు వైసీపీని నమ్మరని జీవీఎల్ తెలిపారు.
Updated Date - 2022-12-07T14:58:20+05:30 IST