CPI Ramakrishna: అలా అరెస్ట్ చేయటానికి అయ్యన్న ఏమైనా టెర్రరిస్టా?
ABN, First Publish Date - 2022-11-03T11:12:04+05:30
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు అర్థరాత్రి గోడ దూకి అరెస్టు చేయటానికి అయ్యన్నపాత్రుడు (Former minister) ఏమైనా టెర్రరిస్టా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు అరెస్టు రాజకీయ కక్షతో జరిగిన చర్య అని అన్నారు. జగన్ ప్రభుత్వం (Jagan government) ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందన్నారు. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను బేషరతుగా విడుదల చేయాలని రామకృష్ణ (CPI Leader) డిమాండ్ చేశారు.
Updated Date - 2022-11-03T11:12:07+05:30 IST