Ramakrishna: ధర్మాన మంత్రి పదవికి అనర్హుడు..
ABN, First Publish Date - 2022-12-31T14:00:23+05:30
అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) విపరీత వ్యాఖ్యలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శించారు.
విజయవాడ: అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) విపరీత వ్యాఖ్యలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakris
hna) విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) దిగజారి మాట్లాడుతున్నారని, మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా, కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డికి, ఆయన సలహాదారులకు తగదన్నారు. చంద్రబాబు (Chandrababu) వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యానేరం కేసులు ఎందుకు మోపలేదని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. విశాఖ (Visakha)ను చిన్న రాష్ట్రంగా చేయాలనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనమని, ఆయన మంత్రి పదవికి అనర్హుడని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-12-31T14:00:27+05:30 IST