ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: కేంద్రం మెడలు వంచుతామన్న సీఎం జగన్ ఏం చేస్తున్నారు?..

ABN, First Publish Date - 2022-11-13T14:23:47+05:30

నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో రాష్టానికి అనేక హామీలు ఇస్తారని ప్రజలు ఎదురు చూసారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో రాష్టానికి అనేక హామీలు ఇస్తారని ప్రజలు ఎదురు చూసారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విభజన, ఏ ఒక్క హామీ గురించి ప్రధాని మాట్లాడలేదని, ప్రత్యేక హోదా, విశాఖ జోన్, కడ

ప ఉక్కు విషయంలో మోసం చేశారని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఉమ్మడిగా పోరాటం చేస్తామని, 26న డిల్లీలో ధర్నా నిర్వహిస్తామని, అందరూ కలిసి రావాలని రామకృష్ణ పిలుపిచ్చారు.

నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజలకు.. మోదీకి సంఘర్షణ జరుగుతోందన్నారు. జగన్ సీఎం అయ్యాక మోదీ కాళ్ల దగ్గరకు వెళ్ళారని, జగన్‌కు తన కేసుల కోసం తప్ప, రాష్ట్ర ప్రయోజనం అవసరం లేదన్నారు. పవన్ కల్యాణ్ బలంగా ఉండి కూడా బీజేపీ రూట్ మ్యాప్ అనడం బాధాకరమన్నారు. మోదీతో జరిగిన భేటీలో తనకు జరిగిన అవమానం గురించి తప్ప రాష్ట్రం గురించి పవన్ మాట్లాడలేదని విమర్శించారు. టీడీపీ కూడా బీజేపీతో కలవడం కోసం చూస్తుందన్నారు. జగన్ తెలుగులో మాట్లాడితే .. మోదీకి ఏం అర్ధం అవుతుందన్నారు. మూడు రాజధానుల గురించి నిన్న సీఎం ఎందుకు మాట్లాడలేదని నరసింహారావు ప్రశ్నించారు.

Updated Date - 2022-11-13T14:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising