CPM: ధర్నాలు చూసి ప్రభుత్వం భయపడుతోంది
ABN, First Publish Date - 2022-12-27T14:31:19+05:30
రాష్ట్రం(AP)లో ధర్నాలు చూసి ప్రభుత్వం (Ycp Government) భయపడుతోందని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాస్ అన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం- సేవ్ డెమోక్రసీ అఖిలపక్ష
విజయవాడ: రాష్ట్రం (AP)లో ధర్నాలు చూసి ప్రభుత్వం (Ycp Government) భయపడుతోందని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాస్ అన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం- సేవ్ డెమోక్రసీ అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఆడవాళ్లను కూడా ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే ప్రజలు, ప్రతిపక్షాలకు మనుగడ. ప్రజల హక్కులు కాపాడతామన్న భరోసా అధికారంలోకి రాబోయే పార్టీ కల్పించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం కలసికట్టుగా ఆపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. ధర్నాలకే భయపడిపోయే ప్రభుత్వం ఇది. ప్రజలే ప్రభుత్వానికి నోటీసులిచ్చే పరిస్థితులు వస్తాయి. ప్రజా ఉద్యమాలు కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇందుకు సీపీఎం మద్దతు తెలుపుతుంది.’’ అని చెప్పుకొచ్చారు.
Updated Date - 2022-12-27T14:32:13+05:30 IST