ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Deputy CM: కృష్ణ గొప్పనటుడే కాదు...గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి...

ABN, First Publish Date - 2022-11-15T16:26:22+05:30

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రముఖ చలనచిత్ర నటుడు, సినీ హీరో, సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణ గొప్పనటుడే కాదు...గొప్ప వ్యక్తిత్వం, విలువలు ఉన్న మనిషని కొనియాడారు. సంపాదనతో నిమిత్తం లేకుండా సమాజ హితం కోసం ఆయన అనేక సందేశాత్మక చిత్రాలు తీశారన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాదని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి గొప్పవారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడని ప్రశంసించారు.

పశ్చిమగోదావరి జిల్లాకు కృష్ణకు విడదీయరాని అనుబంధం ఉందని కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీలో ఆయన బీఎస్సీ చదువుకున్నారని, 1989 ప్రాంతంలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారన్నారు. కృష్ణ పని చేసిన రెండేళ్ల కాలంలో ముంపు బాధిత రైతులకు ఎంతో సహాయం చేశారన్నారు. చెరకు రైతులకు సకాలంలో పర్మిట్లు ఇప్పించేందుకు కృషి చేశారని, పశ్చిమ, కృష్ణా డెల్టాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు ప్రత్యేకత, అక్కడి ప్రజల జీవన విధానం, కష్టసుఖాలు తెలియజేస్తూ.. "కొల్లేటి కాపురం" అనే సినిమా తీశారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.

Updated Date - 2022-11-15T16:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising