MP Raghurama: ఏపీలో ముందస్తు ఎన్నికలు?..
ABN, First Publish Date - 2022-12-20T15:43:04+05:30
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు (Early Elections) వచ్చేలా కనిపిస్తోందని, మూటలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు (Early Elections) వచ్చేలా కనిపిస్తోందని, మూటలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Ra
ghurama Krishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగనన్న (Jagananna) గృహ హింస, గృహ సారథులు రాబోతున్నారని, ప్రజల విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం కోల్పోయిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో విజయసాయిరెడ్డి (Vijayasaireddy) అల్లుడు అప్రూవర్‌గా మారారని, త్వరలో విజయసాయి గుట్టు బయటకు వస్తుందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
కర్ణాటకతో పాటు ఎన్నికలు వస్తాయా? లేక తెలంగాణతో పాటు వస్తాయా అనేది చూడాలని రఘురామ అన్నారు. వాలంటీరీ వ్యవస్థ వైసీపీ నేతలకు ఇబ్బందులు తీసుకురాక తప్పదన్నారు. వివేకానందరెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినట్టు.. లిక్కర్ కేసులో అల్లుడు అప్రూవర్‌గా మారారన్నారు. సాయిరెడ్డి రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ అయ్యారని, గతంలో తాను కూడా పిర్యాదు చేశానని అప్పుడు తీసేశారని అన్నారు. ఇప్పుడు కాళ్ళ వెళ్ల పడి జైల్లో దోస్తుతో మాట్లాడి పదవి తెచ్చుకున్నట్టు తెలిసిందన్నారు. పోయిన పదవిని అడిగి తెచ్చుకున్నందుకు సాయిరెడ్డికి రఘురామ శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2022-12-20T15:43:07+05:30 IST