ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi: సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ

ABN, First Publish Date - 2022-11-27T13:02:47+05:30

అమరావతి: మత్స్యకారుల ఇబ్బందులను వివరిస్తూ సీఎం జగన్‌ (CM Jagan)కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) లేఖ (Letter) రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మత్స్యకారుల ఇబ్బందులను వివరిస్తూ సీఎం జగన్‌ (CM Jagan)కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) లేఖ (Letter) రాశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా మత్స్యకారుల అభివృద్ధి పడకేసిందని, వేట నిషేధ సమయంలో ప్రభుత్వ ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు నాడు చంద్రన్న బీమా అమలు చేస్తే.. నేడు ఈ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందన్నారు. టీడీపీ (TDP) అందించిన ఏ సంక్షేమ పథకాలు.. ఇప్పుడు మత్స్యకారులకు అందడంలేదని విమర్శించారు.

మత్స్య, మిత్ర గ్రూపులు, ఫిష్ మార్కెట్ల ఏర్పాటు చంద్రబాబు (Chandrababu)కే చెల్లిందని.. మత్స్యకారులకు పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించిన ఘనత కూడా చంద్రబాబుదేనని ఎమ్మెల్యే అనగాని అన్నారు. టీడీపీ హయాంలో మడ అడవుల వల్ల వేల మందికి ఉపాధి కల్పించామని, ఇవాళ ధనార్జన కోసం జగన్ ప్రభుత్వం అడవులను ధ్వంసం చేస్తోందని విమర్శించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వీర్యంతో మత్స్యకారుల పిల్లల భవిత నాశనమవుతోందని, గత ప్రభుత్వంలోని అమలు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరించి.. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-11-27T13:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising