MP Raghurama: ఇబ్బందులు తప్పవు అని వైసీపీ నేతలు అంటున్నారు..
ABN, First Publish Date - 2022-12-23T15:18:50+05:30
ఢిల్లీ: ఉత్తరాంధ్ర అంత పసుపు మయమైందని, చంద్రబాబు (Chandrababu) సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
ఢిల్లీ: ఉత్తరాంధ్ర అంత పసుపు మయమైందని, చంద్రబాబు (Chandrababu) సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫేక్ పబ్లిసిటీ చేసుకునే వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి ఇది భయాన్ని కలిగిస్తోందని అన్నారు. డ్వాక్రా మహిళలు మీటింగ్కు రాకపోతే.. ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు (YCP Leaders) అంటున్నారని.. జనం రాకపోతే తిరగడం మానేయ్యాలని సూచించారు. ఇప్పటికే గడపగడపకు వెళ్తే జనాలు కొట్టే పరిస్థితి ఉందని.. సెక్షన్ 149 సీఆర్‌పీసీ (CRPC) ఏదైనా క్రైమ్ (Crime) జరిగే అవకాశం ఉంటే.. ముందే పోలీసులు తెలుకునే ప్రయత్నం చేస్తారన్నారు.
ఏపీ పోలీసుల కహానీలు దారుణంగా ఉన్నాయని రఘురామ మండిపడ్డారు. గతంలో తన ఇంటి ముందు ఇంటలిజెన్స్ పెట్టాలని.. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఏపీ పోలీసులు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఒక లేఖ పంపారన్నారు. కొడాలి నాని మణికొండలో ఉంటారని, ఆయన ఇంటి దగ్గర తెలుగు యువత ఆందోళన చేసిన నేపధ్యంలో అక్కడ నిఘా పెట్టామని అంటున్నారన్నారు. కొడాలి నాని, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ నివాసాలు ఉంటాయి..
, వారి నివాసానికి తన నివాసానికి కిలోమీటర్ దూరం ఉంటుందన్నారు. ఎక్కడో కిలోమీటరు దూరంలో ఉన్న తన ఇంటి ముందు పోలీసులను ఎలా పెడతారని ప్రశ్నించారు. పోలీసులు కథలు చెప్పితే అతికేల ఉండాలని రఘురామ అన్నారు.
Updated Date - 2022-12-23T15:18:55+05:30 IST