Amaravathi: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-12-08T14:09:51+05:30
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arunkumar) పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి సుప్రీంకోర్టు (Supreme Court)లో వస్తే దాన్ని వైసీపీ (YCP) స్వాగతిస్తుందన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలి.. లేదా సరిదిద్దాలని కోరతామన్నారు. విభజన జరిగిన తీరుపైనే కేసు వేశారని, హామీల అమలు కోసం కాదని.. విభజన హామీల అమలు కోసం ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని సజ్జల స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు కలిసే అవకాశాన్నీ ఏపీ సర్కార్ ఉపయోగించుకుంటుందని, ఇరు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సిందేముందన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని విమర్శించారు. రెండు రాష్ట్రాలు కలిసేదాని కోసం వైసీపీ పోరాడుతోందని మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2022-12-08T15:08:18+05:30 IST