ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు పెడితే జగన్ ఖర్మ..

ABN, First Publish Date - 2022-12-28T12:06:47+05:30

కరోనా సమయంలో పరీక్షలు పెట్టి పిల్లల ప్రాణాలు తీసేందుకు సీఎం జగన్ (CM Jagan) ప్రయత్నించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)కు సిద్ధమవుతున్నారు. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు ‘యువగళం (Yuva Galam)’ పేరు ఖరారైంది. యువగళం పేరుతో ప్రత్యేక జెండా రూపకల్పన చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) యువగళం జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కరోనా సమయంలో పరీక్షలు పెట్టి పిల్లల ప్రాణాలు తీసేందుకు సీఎం జగన్ (CM Jagan) ప్రయత్నించారని ఆరోపించారు. పదో తరగతి విద్యార్థులు.. తల్లిదండ్రుల తరపున నారా లోకేష్ పోరాడి పిల్లల ప్రాణాలు కాపాడారన్నారు. చాలా కాలం తర్వాత పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారని, కానీ చాలా మందికి ఏజ్ బార్ అయిందన్నారు. లోకేష్ ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని.. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఏజ్ బార్ అయిన యువతకు వెసులుబాటు కల్పించారన్నారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు పెడితే జగన్ ఖర్మ అన్నారు. ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తే.. దారిలో ఉన్న గడ్డిని కూడా క్లియర్ చేశామన్నారు. లోకేష్ పాదయాత్రపై పోలీసుల అనుమతి కోరతామని, లోకేష్ అడుగులో అడుగేయాలని యువతను కోరుతున్నామని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2022-12-28T12:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising