Devineni Uma: చంద్రబాబు రోడ్ షో సమయంలో కరెంట్ ఎందుకు పోయింది?...
ABN, First Publish Date - 2022-11-10T12:37:24+05:30
నందిగామ ఘటనపై సాక్షి పత్రిక, ఛానల్ తప్పుడు కథనాలు ప్రచురించిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఘటనపై సాక్షి పత్రిక, ఛానల్ తప్పుడు కథనాలు ప్రచురించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై ఆరు టీమ్‌లు ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకుంటామని పోలీస్ కమిషనరే చెప్పారని, ఇంతవరకు పురోగతి లేదని ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా కరెంట్ పోవడమేంటని ప్రశ్నించారు. బహిరంగ సభ జరిగే సమయంలో సంచులు పట్టుకుని కొందరు నిలబడ్డారని, ఆ ఫొటోను విడుదల చేశామన్నారు. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మధుకి గాయం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చూశారని దేవినేని ఉమ అన్నారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. విధ్వంసం, అబద్ధాలు చెప్పడం వైసీపీ ప్రభుత్వ విధానమని విమర్శించారు. నిర్మించడం, నిజాలు చెప్పడం తెలుగుదేశం పార్టీ విధానమని ఆమె వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-11-10T12:37:27+05:30 IST