ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవాని దీక్ష విరమణలు

ABN, First Publish Date - 2022-12-19T11:55:33+05:30

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై గత ఐదు రోజులుగా వైభవంగా జరిగిన భవానీ దీక్ష విరమణలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై గత ఐదు రోజులుగా వైభవంగా జరిగిన భవానీ దీక్ష విరమణలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ (Durgamma Temple EO Brahmaramba)మాట్లాడుతూ... ఈ ఏడాది నాలుగున్నర లక్షల మంది భవాని భక్తులు మాల విరమణకు వచ్చారన్నారు. ఈ ఏడాది దసరాలోనే ఎక్కువ మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. రోజుకి మూడు లక్షల లడ్డూల వరకు విక్రయించినట్లు చెప్పారు. కేశఖండనశాల, స్నానాల గాట్ల వద్ద మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. సుమారు రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు భవాని దీక్ష విరమణలకు ఖర్చు అయి ఉండవచ్చని అన్నారు. భవానీ దీక్షల సందర్భంగా జరిగిన అన్ని కార్యక్రమాలకు సహకరించిన రెవిన్యూ, పొలీసు, మునిసిపల్, ఫైర్, దేవాదాయ శాఖ అధికారులకు ఈవో భ్రమరాంబ ధన్యవాదాలు తెలియజేశారు.

దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శర్మ మాట్లాడుతూ... ఈ ఏడాది విజయవంతంగా భవాని దీక్ష విరమణలు ముగిశాయన్నారు. భవాని దీక్ష విరమణలు చేయడం వల్ల లోకం సస్యశ్యామలంగా ఉంటుందని... సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర పాలకులు కూడా ధర్మబద్ధంగా పాలన జరుగుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-19T11:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising