ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cotton farmers : నకిలీ విత్తు.. పత్తి రైతు చిత్తు!

ABN, First Publish Date - 2022-10-28T03:56:54+05:30

నంద్యాల జిల్లా మిడుతూరు మండలం గుడిపాడుకు చెందిన రైతు కె.వెంకటరెడ్డి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పైరు పచ్చగా ఎదిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్షల హెక్టార్లలో నష్టపోయిన రైతులు

తోటలను పరిశీలించిన శాస్త్రవేతల బృందం

కర్నూలు, ఆక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా మిడుతూరు మండలం గుడిపాడుకు చెందిన రైతు కె.వెంకటరెడ్డి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పైరు పచ్చగా ఎదిగింది. చెట్లు ఏపుగా ఎదిగినా.. పూత రాలేదు. కాయ కాయలేదు. నాసిరకం విత్తనాలే కొంపముంచాయని గగ్గోలు పెడుతున్నాడు. ఒక్క వెంకటరెడ్డే కాదు.. రాయలసీమ జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతుల గోడు ఇది. తెల్ల బంగారాన్ని నమ్ముకొని రూ.వేలకు వేలు అప్పు చేసి సాగు చేస్తే నాసిరకం విత్తనాలు, వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 15.25 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది అత్యధికంగా 16.62 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆదోని పత్తి మార్కెట్‌లో గత ఏడాది పత్తి క్వింటా సరాసరి రూ.10-11 వేలకుపైగా పలికింది. రాష్ట్రంలో 6.10 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేస్తే.. ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 2.91లక్షల హెక్టార్లలో పత్తి వేశారు. ఎకరాకు రూ.45 వేలకుపైగా పెట్టుబడి పెట్టారు.

విత్తనమే దెబ్బతీసిందా?

రాష్ట్ర ప్రభుత్వం పత్తి విత్తనాల విక్రయానికి 30 కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా పత్తి విత్తనాలు అమ్మారు. పత్తి దిగుబడులు చేతికి రావాల్సిన సమయం ఇది. తీరా చేలను చూస్తే.. చెట్టు పచ్చగా, ఎత్తుగా ఎదిగినా... పూత, పిందె, కాయ రాలేదు. నాసిరకం విత్తనాలతో నట్టేట మునిగామని కర్నూలు జిల్లా ఎ.గోకులపాడుకు చెందిన శంకరయ్య వాపోయారు. ఈ గ్రామంలోనే 4వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని అంటున్నారు. ఆదోని, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పత్తి రైతులు అనేక చోట్ల ఆందోళనకు దిగారు.

పత్తికి నష్టం నిజమే: శాస్త్రవేత్తల బృందం

పత్తి పంట దెబ్బతినడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఓ బృందాన్ని నియమించింది. గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) లాంఫాం ప్రిన్సిపల్‌ శాస్త్రవేతలు సుధారాణి, శ్రీలక్ష్మి, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు ప్రభాకర్‌, మోహన్‌, విష్ణువర్ధన్‌ బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మూడు రోజులు పర్యటించింది. పత్తి పొలాలను పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. ‘ఈ ఏడాది పత్తి పంట తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవమే. మేము పరిశీలించిన పొలాల్లో పూత, కాయ రాలేదు. కాసిన నాలుగైదు కాయలు కూడా నల్లబారిపోయాయి. రైతులు ఒక్క క్వింటాలు కూడా దిగుబడి చూడలేదు. సమగ్ర వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం’ అని బృందానికి నాయకత్వం వహిస్తున్న సుధారాణి చెప్పారు.

Updated Date - 2022-10-28T03:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising