ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శికి లేఖ

ABN, First Publish Date - 2022-11-05T17:52:07+05:30

ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శికి టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. రాజధాని అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు.

Lokesh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శికి టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. రాజధాని అమరావతిలో రహదారుల దుస్థితిపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉండటంతో.. విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు. తక్షణమే రహదారి మరమ్మతులు చేయాలని, రాష్ట్రంలో లో మూడున్నరేళ్లుగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. రహదారులతో పాటు మౌలిక సదుపాయాలుంటేనే.. విద్య, వైద్య ఇతర రంగాల్లో ప్రగతి సాధ్యమవుతుందని లేఖలో లోకేష్‌ తెలిపారు.

ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపుగా అన్ని ప్రధాన రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ రోడ్లమీద ప్రయాణమెట్లా..? మహాప్రభో.. అని ప్రజలు హడలిపోతున్నారు. చాలా వరకు ప్రధాన రోడ్లన్నీ. గుంతలతో నిండి ఉన్నాయి. రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి.

Updated Date - 2022-11-05T17:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising