AP News: కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్య ఆరా
ABN, First Publish Date - 2022-11-29T12:41:15+05:30
టీడీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు.
నెల్లూరు: టీడీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah naidu) ఆరా తీశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డికి వెంకయ్య ఫోన్లో పరామర్శించారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరును, అందుతున్న వైద్యాన్ని వెంకయ్య నాయుడుకి కోటంరెడ్డి వివరించారు. ఆరోగ్యం జాగ్రతగా చూసుకోవాలని, త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలని వెంకయ్య నాయుడు సూచించారు.
Updated Date - 2022-11-29T12:41:16+05:30 IST