ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy: ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన..

ABN, First Publish Date - 2022-12-17T14:53:20+05:30

అమరావతి: ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఈ అంశంపై స్పందించిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా.. కేంద్రం ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదన్నారు. మాచర్ల ఘటన చూసిన తర్వాత అసలు ఏపీ (AP)లో.. ప్రజాస్వామ్యం బ్రతికుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (Brahmananda Reddy)బలమైన నాయకత్వాన్ని వైసీపీ (YCP) జీర్ణించుకోలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని విమర్శించారు. ముమ్మాటికే ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన అరాచక ఘటనేనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. అరాచక శక్తుల ఆగడాలతో మహిళలు, తల్లీబిడ్డలు వంటిళ్లలో దాక్కుని ఏడుస్తున్నా ఊరుకోకుండా విధ్వంసం కొనసాగించారన్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయడంతో పాటు వేలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయించి వచ్చే ఎన్నికలకు వారిని దూరం చేసే కుట్రలో భాగమే ఈ అరాచక పర్వమన్నారు. శాంతి భద్రతలతో పాటు అనేక అంశాల్లో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను మూటగట్టుకుందని సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-12-17T14:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising