Revanth Reddy: జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర
ABN, First Publish Date - 2022-12-18T21:09:36+05:30
Hyderabad: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తానని టీపీసీసీ (TPCC Chief) చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను
Hyderabad: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తానని టీపీసీసీ (TPCC Chief) చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ (Congress) పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రద్దయిన జిల్లా, మండల కార్యవర్గాల స్థానంలో కొత్త కమిటీలు వేస్తామన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌పై కేసీఆర్ రౌడీ మూక దాడి చేసిందని, కర్ణాటక, తెలంగాణ కోసం తయారు చేసిన ప్రణాళిక డేటా దొంగిలించారని ఆరోపించారు. సీపీ ఆనంద్ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టి.. కేసీఆర్ మెప్పు పొంది డీజీపీ పదవి పొందాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ సహా ఏ కాంగ్రెస్ నేతపైనా తప్పుడు పోస్టులు పెట్టినా చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - 2022-12-18T21:15:38+05:30 IST