ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram: పోలవరం ఇప్పట్లో కష్టం.. తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-08T20:45:48+05:30

అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు (Polavaram project) భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు తెలంగాణ (Telangana) అడ్డుపుల్లలు వేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు (Polavaram project) భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవైపు తెలంగాణ (Telangana) అడ్డుపుల్లలు వేస్తోంది. మరోవైపు చట్టబద్ధంగా నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నింద మోపుతున్నది. ఇవన్నీ అటుంచితే కేంద్రాన్ని నిధుల కోసం నిలదీయలేని నిస్సహాయ స్థితిలో సీఎం జగన్ ఉన్నారు. ఈ కారణాలన్నీ ఆ ప్రాజెక్టుకు శాపంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్లు పోలవరం ఇప్పట్లో కష్టమేనంటూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) తేల్చేసింది. పార్లమెంటు సాక్షిగా పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం పూర్తయ్యే అవకాశమే లేదని కేంద్రం స్పష్టం చేసింది. మార్చి 2024 నాటికి పోలవరం పూర్తి చేయాలనుకున్నామని.. అయితే 2020, 2022లో వచ్చిన భారీ వరదల కారణంగా మరింత జాప్యం జరుగుతుందని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. కాగా.. సవరించిన పోలవరం అంచనాల ఆమోదంపై కేంద్రం ఎటూ తేల్చేక పోవడం గమనార్హం. రూ.484 కోట్లు మాత్రమే ఏపీకి రీయింబర్స్‌మెంట్ చేయాలని కేంద్రం పేర్కొంది. లోక్‌సభలో ఎంపీలు కేశినేని నాని, కృష్ణదేవరాయ, కోటగిరి శ్రీధర్‌ ప్రశ్నకు.. కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి భిశ్వేశ్వర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

పోలవరం ప్రాజెక్టు మౌలికంగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడి దాని నిర్మాణ బాధ్యత కేంద్రప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. ఈ జాతీయ హోదా 2014 విభజన చట్టం ద్వారా వచ్చింది. కానీ 2014కి ముందే నిర్మాణం ఉమ్మడి రాష్ట్ర ఆధ్వర్యంలో జరుగుతుండటంతో, అప్పటికే కొద్దో గొప్పో పురోగతి ఉండటంతో, అదే విధానాన్ని కొనసాగించడానికి కేంద్రం సమ్మతించింది. అంతేగాక నిర్మాణాన్ని కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా పర్యవేక్షణ జరగడానికి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగానే డిజైన్లను పర్యవేక్షించడానికి డ్యామ్ డిజైన్ల రెవ్యూ ప్యానెల్ అని ఒకటి, నిర్మాణ ప్రక్రియ ఆర్థిక లావాదేవీలను నియంత్రించడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనే ఇంకొక వ్యవస్థ ఏర్పరిచి 2014 నుంచి ప్రాజెక్టు పురోగతిని నిర్ధేశిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకి మొదటి నుంచీ అడ్డంకులు ఎక్కువే. భూ సేకరణ గానీ, పునరావాసం గానీ, అటవీభూముల అనుమతులు, వన్యప్రాణి రక్షణ అనుమతులు ఇలాగే అనేక అంశాల్లో చాలా ప్రభుత్వశాఖల సమన్వయం కూడగట్టటంలో జాప్యం జరుగుతూ వచ్చింది.

Updated Date - 2022-12-08T20:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising