Botsa: చంద్రబాబులా మేమెందుకు మాట్లాడడం లేదంటే..
ABN, First Publish Date - 2022-11-21T14:40:33+05:30
సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డే సీఎంగా (Cm jagan) ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో
శ్రీకాకుళం: సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డే సీఎంగా (Cm jagan) ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో నరసన్నపేటలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. ‘‘చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాతున్నారు. బాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయి. అతనే నిజాయితీ.. సచ్చీలుడుగా మాటాడుతున్నారు. సభ్యసమాజం హర్షించని విధంగా చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతున్నారు. సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. చంద్రబాబే.. యోగి, మహాపురుషుడు అని చెప్పుకుంటూ ఇతరులను దుర్మార్గులు అంటున్నారు. వైసీపీ వెనుక జనం ఉన్నారని అసహానానికి లోనవుతున్నారు. ఇంత వయసు వచ్చి ఎందుకు సహనం కోల్పోతున్నారో..? మాకూ మాటలు వచ్చు.. రాజ్యాంగాన్ని గౌరవించి మాట్లాడటం లేదు. ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెబుతూ పబ్లిసిటీ కోసం మాటాడాల్సిన పనిలేదు.’’ అని బొత్స వ్యాఖ్యానించారు.
‘‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటే చాలు. భూ రికార్డుల సమస్యపై పాదయాత్రలో రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకోసమే అధికారంలోకి వచ్చాక భూ హక్కు కార్యక్రమం తీసుకువచ్చాం. దేశం మెత్తం భూ హక్కు కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రామకంఠాలు, ఎండోమెంట్, ఉమ్మడి కుటుంబాల భూ సమస్య లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈనెల 23న నరసన్నపేటలో రెండో విడత శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమం సీఎం ప్రారంభిస్తారు. ప్రభుత్వంతో పాటు కార్యకర్తలంతా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి.’’ అని బొత్స పిలుపు నిచ్చారు.
Updated Date - 2022-11-21T14:40:34+05:30 IST