ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharmana: తెలుగుదేశాన్ని వెలివేయండి

ABN, First Publish Date - 2022-11-23T13:07:16+05:30

చంద్రబాబు(Chandrababu) జూమ్ కెమెరాకు దగ్గరగా.. రాష్ట్రానికి దూరంగా ఉంటారని.. అలాంటప్పుడు హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు రాజధాని ఎక్కడ పెట్టుకుంటే మీకెందుకు?

తెలుగుదేశాన్ని వెలివేయండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: రాజధానిగా విశాఖను అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీని వెలివేయాలని మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు(Dharmana Prasada Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నరసన్నపేటలో జరిగిన సీఎం(Cm jagan) బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. రాజధానిగా విశాఖ వద్దని ప్రజలు అంటున్నారని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అంటున్నారని.. దయచేసి ఆ విధంగా అడ్డుకోవద్దని కోరారు. చేతకాకపోతే సైలెంట్‌గా ఉండాలని.. ఈ ప్రాంతానికి మాత్రం అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖలో రాజధాని పెడితే మీకేంటి ఇబ్బంది.. జగన్ ఏమైనా ఇడుపులపాయలో పెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అయినా చంద్రబాబు(Chandrababu) జూమ్ కెమెరాకు దగ్గరగా.. రాష్ట్రానికి దూరంగా ఉంటారని.. అలాంటప్పుడు హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబుకు రాజధాని ఎక్కడ పెట్టుకుంటే మీకెందుకు? అని నిలదీశారు. అమరావతి పేరుతో పాదయాత్ర చేసిన రైతులు తోక ముడిచి వెనుకకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పెట్టారా? అని అడిగారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పగలరా? అని అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. 700 కోట్లతో హిర మండలం నుంచి ఉద్దానంకు మంచి నీరు అందిస్తున్నామని.. టీడీపీ హయాంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏం చేశారో చెప్పాలని మంత్రి ధర్మాన ప్రశ్నించారు.

Updated Date - 2022-11-23T14:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising