Yanamala: ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం జగన్‌కు లేఖ
ABN, First Publish Date - 2022-11-01T17:40:29+05:30
ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు

TDP senior leader Yanamala Ramakrishnudu
గుంటూరు: ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై సీఎం జగన్‌కు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. పారిశ్రామిక రంగం మూడేళ్లుగా అధోగతి పాలైందని టీడీపీ నేత యనమల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలో ఉన్నాయని, రూ.17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యమవుతోందని, రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని సీఎంకు రాసిన లేఖలో యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-01T17:54:24+05:30 IST