ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaranath: విశాఖ వేదికగా ముఖ్యమంత్రి పాలిస్తారు

ABN, First Publish Date - 2022-11-28T18:22:49+05:30

Vizag: విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పాలన చేస్తారని, త్వరలో పాలన తేదీలను ప్రకటిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై హర్షం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vizag: విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పాలన చేస్తారని, త్వరలో పాలన తేదీలను ప్రకటిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. మా ప్రభుత్వ ఆలోచనను సుప్రీంకు స్పష్టంగా చెప్పాం. సుప్రీం ఉత్తర్వులతో ఇప్పటికైనా టీడీపీ, తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి. హైదరాబాద్ కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపాం. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారు. ఐడీ కార్డ్స్ ఆడిగేసరికి..అమరావతి రైతులు పారిపోయారు..యాత్ర ఏమైంది?’’ అని ప్రశ్నించారు. పాలన రాజధాని కోసం విశాఖలో ఒక సెంట్ ప్రైవేటు భూమి కూడా తీసుకోమని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-28T18:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising