Bhimavaram: పవన్ పోటీ చేసిన భీమవరంలో ఏం జరుగుతుందో చూడండి..!
ABN, First Publish Date - 2022-10-31T12:25:49+05:30
కార్తీక మాసం వచ్చేసింది.. ఈ నెలలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.. తెలుగు వారి సంస్కృతిలో భాగమైన వన భోజనాల సందడి మొదలవుతుంది. బంధుగణం, స్నేహితులతో కలసి ఆహ్లాదకరంగా ప్రకృతి ఒడిలో..
ఈసారి రాజకీయ వన భోజనాలే !
అన్ని కులాలు కార్తీక మాస భోజనాలకు సమాయత్తం
గోదావరి జిల్లాల్లో అధిక ఓటింగ్ ఉన్న శెట్టిబలిజ, గౌడ కులాలు..
రాజమహేంద్రవరంలో సామూహిక భోజనాలతో శ్రీకారం
త్వరలో కాపు వన భోజనాలు.. అన్ని సామాజిక వర్గాలదీ అదే బాట
భీమవరం: కార్తీక మాసం (Karthika Masam) వచ్చేసింది.. ఈ నెలలో వన భోజనాలకు (Karthika Vanabhojanalu) ఎంతో ప్రాధాన్యం ఉంది.. తెలుగు వారి సంస్కృతిలో భాగమైన వన భోజనాల సందడి మొదలవుతుంది. బంధుగణం, స్నేహితులతో కలసి ఆహ్లాదకరంగా ప్రకృతి ఒడిలో.. చెట్ల నీడలో వనభోజనాలు మన సంప్రదాయాలను చాటి చెబుతాయి. అప్పుడే అనేక ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. వీటిని ఒక కులం వారు నిర్వహిస్తే అదే కులానికి చెందిన రాజకీయ నాయకులంతా అక్కడ వాలిపోతారు. అయితే ఇది సాధారణ అంశమే కానీ కొద్దికాలంగా ఇవి రాజకీయ పార్టీ నేతలకు వేదికలుగా మారడమే చర్చకు దారి తీస్తుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కార్తీక మాసంలో తొలి ఆదివారం రాజమహేంద్రవరం (rajahmundry) కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాల స్థాయిలో అత్యధికంగా ఉన్న శెట్టిబలిజ, ఉపకులాలైన గౌడ, శ్రీశైన, యాత, ఈడిగ సామాజికవర్గ వనభోజనాలు నిర్వహించారు. పెద్దఎత్తున తరలి వెళ్లాయి. వచ్చే వారం కాపు సామాజికవర్గం పెద్దఎత్తున కుల సమీకరణ చేపడుతోంది. వన భోజనాలకు అదే సామాజిక వర్గాలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల వారిని ఆహ్వానిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గం పెద్దఎత్తున భీమవరంలో వన భోజనాలు నిర్వహించి, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుని ఆహ్వానించారు.
ఎన్నికల వేడి ఆరంభమయ్యే నేపథ్యంలో..
ఈ ఏడాది కులభోజనాలు, సామాజిక భోజనాలు ఈ విధంగా ఏ భోజనాలైనా ఇప్పుడు రాజకీయ ఎన్నికల వేడి సమీపిస్తున్న సమయం కావడంతో నేతల జోరు పెరుగుతుందనడంలో అతిశయోక్తి కాదు. అధికార ప్రతిపక్షాలకు చెందిన వారు ఈ వేదికలను చక్కగా వినియోగించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. నెల రోజుల పాటు ఈ భోజనాలు కొనసాగుతాయి. రాజకీయ ఎన్నికల నేపథ్యంలో వన భోజనాలతో కలసి చర్చా వేదికలుగా మారనున్నాయి.
Updated Date - 2022-10-31T12:25:55+05:30 IST