AP News: అనకాపల్లిలో యువతిపై కత్తితో దాడి
ABN, First Publish Date - 2022-12-16T12:51:37+05:30
జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడకలో యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడకలో యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గతంలో యువతిని ప్రేమిస్తున్నానంటూ నిందితుడు నానాజీ వేధింపులు గురిచేశాడు. బాధితురాలు తన భార్యనంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. బాధితురాలు ఇంట్లో చెప్పడంతో ఇరు వర్గాల కుటుంబాలు రాజీ కుదుర్చుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మొన్న రాత్రి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు... యువతి తల్లిపై రాడ్డుతో దాడి చేశాడు. దాడి చేస్తున్న క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువతిపై నిందితుడు కత్తితో దాడికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో యువతి చేతిపై గాయాలయ్యాయి. నానాజీపై యువతి అచ్చుతాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-12-16T12:51:38+05:30 IST