ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News.. అందుకే విశాఖ వాసులు విజయమ్మను ఓడించారు: సత్య కుమార్

ABN, First Publish Date - 2022-11-10T13:00:06+05:30

రీ సర్వే ద్వారా వివాదంలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించి 22 ఏలో పెడుతోందని, లక్షల ఎకరాల భూములు కొట్టేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రీ సర్వే ద్వారా వివాదంలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించి 22 ఏలో పెడుతోందని, లక్షల ఎకరాల భూములు కొట్టేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పులివెందుల వాళ్ళు వైజాగ్‌కు మకాం మార్చారని.. భూములను రాబందుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు... సీఎం జగన్ ఫొటోలు ఎందుకో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు కొల్లగొట్టడానికే... భూముల రీ సర్వే చేపట్టారని, భూ రక్ష.. భూ హక్కు పేరుతో.. భూములు దోచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో హైదరాబాద్‌లో కబ్జాలు చేసిన బ్యాచ్ ఇప్పుడు విశాఖకు వచ్చారన్నారు. అందుకే విశాఖ వాసులు విజయమ్మను ఓడించారని సత్య కుమార్ వ్యాఖ్యానించారు.

ఏపీ నుంచి బీజేపీకి ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా.. ప్రధాని మోదీ వివక్ష చూపకుండా అభివృద్ధి చేస్తున్నారని సత్య కుమార్ అన్నారు. వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని.. జాతీయ సంస్థలు ఇచ్చారని కొనియాడారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వానిగా చెప్పుకుంటున్నారని సత్య కుమార్ విమర్శించారు.

Updated Date - 2022-11-10T13:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising