ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థిరంగా అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షసూచన

ABN, First Publish Date - 2022-11-10T21:03:13+05:30

అల్పపీడనం (low pressure) గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: అల్పపీడనం (low pressure) గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనున్నది. తరువాత వాయువ్యంగా పయనించి ఈనెల 12వ తేదీ ఉదయానికి తమిళనాడు, పుదుచ్చేరి (Tamil Nadu Puducherry) తీరానికి దగ్గరగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటి కేరళ దిశగా పయనిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈనెల 11 నుంచి 13 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు (Nellore Chittoor) జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని, 13వ తేదీన నెల్లూరులో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45, అప్పుడప్పుడు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున 11, 12 తేదీల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

Updated Date - 2022-11-10T21:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising