ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: చంద్రబాబు, లోకేష్‌పై నాగార్జున విమర్శలు

ABN, First Publish Date - 2022-11-19T13:09:17+05:30

చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి మెరుగు నాగార్జున(Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సానుభూతి బెడిసికొట్టినట్లు కనిపిస్తోందన్నారు. అందుకే వికేంద్రీకరణ గురించి ప్రజలు అడుగుతుంటే దిగజారి మాట్లాడడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు.

నాగార్జున విమర్శలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి మెరుగు నాగార్జున(Minister Merugu Nagarjuna) విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సానుభూతి బెడిసికొట్టినట్లు కనిపిస్తోందన్నారు. అందుకే వికేంద్రీకరణ గురించి ప్రజలు అడుగుతుంటే దిగజారి మాట్లాడడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను భయపెట్టే స్థాయికి వెళ్తున్నారని.. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. 29 గ్రామాల వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలబెట్టుకోవడం కోసమే యాత్రలు అంటున్నారని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏం ఉపయోగపడడం లేదని చెప్పగలిగే దమ్ము చంద్రబాబు(Chandrababu)కు ఉందా? అని నిలదీశారు. ఇక విశాఖపట్నం, తిరుపతికి వచ్చి మూడు రాజధానులు వద్దని చెప్పగలరా? అని అడిగారు. 2024లో కూడా చంద్రబాబు రథచక్రాలు తొక్కి విరగ్గొడతామని చెప్పుకొచ్చారు. పాదయాత్రతో లోకేష్ రాజకీయంగా ఎదగడం ఒక కల అని వ్యాఖ్యానించారు. లోకేష్(Lokesh) అనే వ్యక్తి వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేని వ్యక్తి అంటూ విమర్శించారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అంటూ చేసిన వ్యాఖ్యలు.. బీసీల తోక కత్తిరిస్తానని చెప్పిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పి లోకేష్ పాదయాత్ర చేయాలని సూచించారు. అలాగే ముద్రగడ పెట్టిన చిత్రహింసలకు.. వంగవీటి రంగా హత్యకు కారణాలు చెప్పి పాదయాత్ర చేయాలని తెలిపారు. ప్రజా ఆమోదం లేని వ్యక్తి చంద్రబాబు అని... ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి ప్రశ్నించారు.

Updated Date - 2022-11-19T13:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising