ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. తాటతీస్తాం: పవన్‌

ABN, First Publish Date - 2022-11-13T17:39:03+05:30

వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదని తప్పుబట్టారు. 2024లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని, జనసేన రావాలని ఆకాంక్షించారు. జనసేన (Jana Sena)కు ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతిపరుల తాటతీస్తామని పవన్‌ ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు జనసేన పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు జనసేన పిలుపునిచ్చింది. 'జగనన్న ఇళ్లు-పేదల కన్నీళ్లు-జగనన్న మోసం' పేరుతో నిరసనలు చేపట్టాలని పవన్ కోరారు. జగనన్న ఇళ్ల పేరుతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. జగనన్న ఇళ్లనే నిర్మించలేనివారు.. రాజధాని నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల దోపిడీపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్‌ విజయనగరం చేరుకున్నారు. విజయనగరం వై-జంక్షన్‌లో (Vizianagaram y junction) పవన్‌కు జన సైనికులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

Updated Date - 2022-11-13T17:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising