ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు కానిస్టేబుళ్లు.. నగ్నంగా స్టేషన్లో..!

ABN, First Publish Date - 2022-10-28T06:23:58+05:30

చోరీ కేసులు, ఇతర క్రిమినల్‌ కేసు నిందితులను పోలీసులు దుస్తులను విప్పించి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తరచూ చూస్తూంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుస్తులు విప్పించి కూర్చోబెట్టిన విజయనగర ఎస్పీ

పేకాట శిబిరంలో సొత్తు కాజేసినందుకు.. కేసు నమోదు.. నిందితులకు రిమాండ్‌

బళ్లారి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): చోరీ కేసులు, ఇతర క్రిమినల్‌ కేసు నిందితులను పోలీసులు దుస్తులను విప్పించి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తరచూ చూస్తూంటాం. కానీ.. పోలీసుల దుస్తులనే ఊడదీసి.. స్టేషన్లో కూర్చోబెట్టారు ఓ పోలీసు ఉన్నతాధికారి. ఆయనే విజయనగర జిల్లా ఎస్పీ అరుణ్‌. విజయనగర పట్టణంలోని చలవారి కాలనీలో వెంకటేశ్‌ మరికొందరు బుధవారం రాత్రి పేకాడుతున్నారు. విషయం తెలిసి మహేష్‌, అభిషేక్‌, మంజునాథ్‌, శ్రీకాంత్‌ అనే నలుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లు పేకాట శిబిరంపై దాడి చేశారు. రూ.20 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ స్వాఽధీనం చేసుకున్నారు. కానీ కేసు నమోదు చేయలేదు. స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్‌ను స్టేషన్‌లో అప్పగించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్టేషన్‌కు వెళ్లిన పేకాటరాయుడు వెంకటేశ్‌, తన సెల్‌ఫోన్‌ ఇవ్వాలని పోలీసులను అడిగాడు. రికార్డులను పరిశీలించిన పోలీసులు, అలాంటి కేసేదీ నమోదు కాలేదని తెలిపారు. దీంతో వెంకటేష్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం ఎస్పీ వరకూ వెళ్లింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు.

పేకాట శిబిరంపై జరిగిన దాడి, నగదు, సెల్‌ఫోన్‌ కాజేసినట్లు తేలడంతో జూదరుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నలుగురు కానిస్టేబుళ్లపైనా ఎస్పీ కేసు నమోదు చేయించారు. ఎస్పీ, కానిస్టేబుళ్ల దుస్తులను విప్పించి రెండు గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. వారిని సస్పెండ్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-10-28T07:08:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising