ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi.. పోలవరం గడువులోగా పూర్తి కావడం కష్టం: కేంద్రం

ABN, First Publish Date - 2022-12-12T16:27:19+05:30

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) గడువులోగా పూర్తి కావడం కష్టమని, పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని రాజ్యసభ సాక్షిగా మరోమారు కేంద్రం తేల్చి చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) గడువులోగా పూర్తి కావడం కష్టమని, పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని రాజ్యసభ సాక్షిగా మరోమారు కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)కి రాజ్యసభ (Rajya Sabha)లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుందా? ఖర్చు, జాప్యంపై సభలో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్ర బోస్ (Subhash Chandra Bose) అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు (Bishweshwar Tudu) లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణం జాప్యం తధ్యమన్నారు.

2019 నుంచి ఇప్పటి వరకు 6461.88 కోట్లు ఏపీ ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగిందని, 2013-14 అంచనాల ప్రకారం రూ. 29,027.95 కోట్లు ఉండగా, 2017-18 అంచనాల ప్రకారం రూ. 47,725.74 కోట్లు అయిందని బిశ్వేశ్వర్ తుడు అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 6,461.88 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లు అన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 13,226.04 కోట్లు చెల్లించామని, ఇంకా మిగిలిన బ్యాలెన్స్ నిధులు రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

కాగా పోలవరం నిర్మాణం గడువు లోపలే పూర్తి చేస్తామంటూ పలుమార్లు వైసీపీ నేతలు, మంత్రులు ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకే సమాధానంగా గడువు లోపు పూర్తి కాదన్న కేంద్రమే తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల రిత్యా గడువు లోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Updated Date - 2022-12-12T16:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising