ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రం మధ్యలో ఊహించని ప్రమాదం.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుండగా.. వెనక్కు తిరిగి చూస్తే..

ABN, First Publish Date - 2022-10-27T21:17:35+05:30

ముగ్గురు మత్య్సకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. తీరా చేపలు పట్టే సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. గాలులు, అలల ఉదృతికి వల వెళ్లి బోటు ఇంజిన్‌లో చిక్కుకుంది. చూస్తుండగానే గాలుల ధాటికి బోటు తిరగబడింది. దాని మీదే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అయితే చివరకు పరిస్థితి విషమించింది. అయినా ధైర్యం కోల్పోకుండా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు మత్య్సకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. తీరా చేపలు పట్టే సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. గాలులు, అలల ఉదృతికి వల వెళ్లి బోటు ఇంజిన్‌లో చిక్కుకుంది. చూస్తుండగానే గాలుల ధాటికి బోటు తిరగబడింది. దాని మీదే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అయితే చివరకు పరిస్థితి విషమించింది. అయినా ధైర్యం కోల్పోకుండా ఎలాగైనా ఒడ్డుకు చేరుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ తీరా ఒడ్డుకు చేరుకునే క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా.. (AP West Godavari) నరసాపురం - కోనసీమ జిల్లా అంతర్వేది మధ్య సముద్రంలో చేపల వేటకు (Fishing in the sea) వెళ్లిన బోటు గురువారం తెల్లవారుజామున అలల ఉధృతికి బోల్తా (boat accident) పడింది. ఈ ఘటనలో నరసాపురం మండలం బియ్యపుతిప్పకు చెందిన మత్స్యకారుడు ఒడుగు నాగరాజు (25) గల్లంతయ్యాడు. అదృష్టవశాత్తు మరో ఇద్దరు మత్స్యకారులు.. ఒడుగు కొండలరావు, తిరుమాని లక్ష్మణస్వామి తెప్ప సాయంతో రెండు గంటలపాటు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. క్షేమంగా బయటపడిన కొండలరావు.. గల్లంతైన నాగరాజు తండ్రి. కళ్ల ముందే కన్న కొడుకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నా రక్షించలేకపోయానని కొండలరావు కన్నీటి పర్యంతమయ్యాడు. వీరు ముగ్గురూ బుధవారం సాయంత్రం బియ్యపుతిప్ప నుంచి ఫైబర్‌ బోటుపై అంతర్వేది సమీపం వరకు వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో బోటులోని వలలు ఎగిరిపడి బోటు ఇంజన్‌కు చుట్టుకున్నాయి. దీంతో బోటు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

అదే సమయంలో గాలుల ఉధృతి పెరగడంతో బోటు తిరగబడింది. ప్రమాదాన్ని గుర్తించిన ముగ్గురూ కొద్దిసేపు తిరగబడ్డ బోటుపై ఎక్కి కూర్చున్నారు. అయినా అలలు, గాలి ఉధృతి తగ్గలేదు. ఇక బోటుపై ఉండటం క్షేమం కాదని భావించిన ముగ్గురూ ఈదుకుంటూ దరికి చేరాలని నిర్ణయించుకున్నారు. నీటిపై తేలుతున్న తెడ్డుల సాయంతో కొంత దూరం ఈదారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నాగరాజు ఈదలేక కొట్టుకుపోయాడు. కొడుకును రక్షించేందుకు కొండలరావు ఈదుకుంటూ వెనక్కి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేది లేక బరువెక్కిన హృదయంతో వెనక్కు వచ్చాడు. ఒడ్డుకు చేరిన వీరిద్దరూ.. జరిగిన ప్రమాదాన్ని గ్రామస్తులకు తెలపడంతో గల్లంతైన నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరికి మెరైన్‌ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు సహకరించారు. అయితే గురువారం సాయంత్రం వరకూ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - 2022-10-27T21:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising