Narsapur: నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్
ABN, First Publish Date - 2022-11-13T14:22:45+05:30
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నరసాపురం నుంచి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు స్టేషన్ మేనేజర్ దివాకర్ శనివారం ప్రకటనలో..
నరసాపురం: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నరసాపురం (Narsapur) నుంచి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్‌కు (Vikarabad) ప్రత్యేక రైలు (Special Train) నడుపుతున్నట్టు స్టేషన్ మేనేజర్ దివాకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ రైలు గుంటూరు(Guntur), సికింద్రాబాద్(Secunderabad), లింగంపల్లి (Lingampalli) మీదుగా మరునాడు ఉదయం తొమ్మిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుందన్నారు. జిల్లాల్లోని పాలకొల్లు (Palakollu), భీమవరం టౌన్ (Bhimavaram), ఆకివీడు స్టేషన్లలో మాత్రమే ఆగుతుందన్నారు.
21, 28 తేదీల్లో నరసాపురం - కొల్లాం మధ్య..
జిల్లా నుంచి శబరిమలైకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈనెల 21, 28 తేదీల్లో నరసాపురం - కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు భీమవరం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మధుబాబు తెలిపారు. 07131 నెంబరుతో ఆయా తేదీల్లో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి విజయవాడ, తిరుపతి, కాట్‌పాడి, తిరుపూర్, కొట్టాయం మీదుగా మరుసటి రోజు సాయంత్రం 6.50 గంటలకు కొల్లాం చేరుకుంటుందన్నారు. తిరిగి అదే రోజు రాత్రి 8.45 గంటలకు 07132 నెంబర్ తో కొల్లాంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటల కు నరసాపురం చేరుకుంటుందన్నారు. ఈ ప్రత్యేక రైలు జిల్లాలోని పాలకొల్లు, భీమవరం జంక్షన్, టౌన్, ఆకివీడు స్టేషన్లలో ఆగుతుందన్నారు.
Updated Date - 2022-11-13T14:23:11+05:30 IST