Yanamala: ఆర్బీఐ రాసిన లేఖను వైసీపీ బయటపెట్టాలి.
ABN, First Publish Date - 2022-12-13T17:57:48+05:30
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి అప్పులు చేస్తుండడంతో.. ఆ భారమంతా రాష్ట్ర ప్రజల మీద పడుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
Amaravathi: సీఎం జగన్ (CM Jagan) సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి అప్పులు చేస్తుండడంతో.. ఆ భారమంతా రాష్ట్ర ప్రజల మీద పడుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Rama Krishna) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 10 శాతం పెరిగితే..అప్పులు 37.5 శాతానికి పెరిగిపోయిందన్నారు.
‘‘రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పుల్లో ఉన్న వృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కనిపించడం లేదు. సీఎం జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. మూడున్నరేళ్లలో రాష్ట ప్రభుత్వ ఆదాయం సరాసరి 10 శాతం మాత్రమే పెరిగింది. అప్పుల వృద్ధి మాత్రం 37.5 శాతానికి ఎగబాకింది. జగన్ దిగిపోయే నాటికి రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంటుంది. తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సిన వృద్ధి రేటు దాదాపు 95 శాతానికి పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ ఈ నెల 9న రాసిన లేఖను బయటపెట్టాలి. ఏడాదికి అసలు, వడ్డీ కలుపుకుని రూ.లక్ష కోట్లు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉంది. వైసీపీ నాయకుల ఆస్తులు పెరుగుతుంటే ప్రజల ఆదాయం తరుగుతోంది. ఆర్టికల్ 360ని అమలు చేసి రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలి.’’ అని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-12-13T18:01:31+05:30 IST