ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2023 Big Changes: క్రెడిట్ కార్డు నుంచి ఇన్సూరెన్స్ వరకు.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!

ABN, First Publish Date - 2022-12-30T14:07:23+05:30

మరికొద్ది గంటల్లో 2022 చరిత్రలో కలిసి పోనుంది. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈ న్యూఇయర్ కొత్త క్యాలెండర్‌తోపాటు.. క్రెడిట్ కార్డు(Credit Card), ఎన్‌పీఎస్(NPS), ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో నూతన మార్పులను కూడా తీసుకొస్తోంది. జనవరి 1 నుంచి అమలులోకి రాబోయే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది గంటల్లో 2022 చరిత్రలో కలిసి పోనుంది. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈ న్యూఇయర్ కొత్త క్యాలెండర్‌తోపాటు.. క్రెడిట్ కార్డు(Credit Card), ఎన్‌పీఎస్(NPS), ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో నూతన మార్పులను కూడా తీసుకొస్తోంది. జనవరి 1 నుంచి అమలులోకి రాబోయే ఆ రూల్స్ చాలా వరకు మనల్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి చోటు చేసుకునే ఆ బిగ్ ఛేంజెస్‌పై ఓ లుక్కేస్తే..

ఇన్సూరెన్స్(Insurance Rules)

ప్రస్తుతం మార్కెట్‌లో లైఫ్ ఇన్సూరెన్స్(Life Insurance), హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance), వెహికిల్ ఇన్సూరెన్స్(Vehicle Insurance) అంటూ ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా వాళ్ల అవసరాన్ని బట్టి ఇన్సూరెన్సు పాలసీలను తీసుకుంటున్నారు. అయితే.. జనవరి 1 నుంచి ఏరకమైన ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే.. కేవైసీ డాక్యుమెంట్ల(KYC documents)ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా((IRDAI) కొద్ది రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. జనవరి 1 నుంచి కొత్తగా ఇన్సూరెన్సులు తీసుకునే వారి వద్ద నుంచి కేవైసీ డాక్యుమెంట్లను తీసుకోవాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచించింది.

ఇకపై అలా డబ్బులు తీసుకోవడం కుదరదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు.. ఇకపై సెల్ఫ్ డిక్లరేషన్లు సమర్పించి తమ ఎన్‌పీఎస్ అకౌంట్ల(NPS account) నుంచి ఆన్‌లైన్ ద్వారా పాక్షిక మొత్తాలను విత్‌డ్రా(Online Partial Withdrawals) చేసుకునే సదుపాయం ఇక ఉండదు. కొవిడ్ దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA) ఉపసంహరించుకుంటున్నట్టు డిసెంబర్ 23న ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం జనవరి 1,2023 నుంచి అమలులోకి రానుందని అందులో స్పష్టం చేసింది. అయితే.. సదరు ఉద్యోగులు తమ నోడల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాక్షిక మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు మాత్రం ఆన్‌లైన్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని వివరించింది.

రివార్డు పాయింట్లలో కోత

ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డుల(SBI Credit Card)ను ఆన్‌లైన్ షాపింగ్‌ చేయడం ద్వారా పొందే రివార్డు పాయింట్లలో కోత విధించేందుకు చర్యలు తీసుకుంది. మొన్నటి వరకు ఎస్బీఐ కార్డును ఉపయోగించి అమెజాన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. కస్టమర్లకు 10X రివార్డు పాయింట్లు వచ్చేవి. కానీ జనవరి 1 నుంచి కేవలం 5X రివార్డు పాయింట్లు మాత్రమే రానున్నాయి. అయితే.. బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్‌ తదితర వెబ్‌సైట్‌లలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే ఎప్పటిలాగే 10X రివార్డు పాయింట్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ(HDFC Credit Card) కూడా ఇదే బాటలో పయనిస్తోంది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి.. రివార్డు పాయింట్ల కేటాయింపు, రీడీమ్ చేసుకునే విషయాల్లో పరిమితులు విధించింది.

ఇది కూడా చదవండి: Viral News: పోలీస్ కస్టడీలో కోళ్లు.. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత విడుదల!

Updated Date - 2022-12-30T14:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising