ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

twitter: భారత్‌లో ట్విటర్ ‘బ్లూ టిక్’పై తేల్చిచెప్పిన ఎలాన్ మస్క్

ABN, First Publish Date - 2022-11-06T11:07:57+05:30

మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ట్విటర్‌’లో (twitter) ఐడెంటిటీని నిర్ధారించే ‘బ్లూ టిక్ ’(Blue tick) సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజు వసూలు చేయడంపై కంపెనీ కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon musk) ఇటివలే స్పష్టం చేశారు. మరి భారత్‌లో ఎప్పటి నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ట్విటర్‌’లో (twitter) ఐడెంటిటీని నిర్ధారించే ‘బ్లూ టిక్ ’(Blue tick) సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజు వసూలు చేయబోతున్నట్టు కంపెనీ కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon musk) ఇటివలే స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లోకి తీసుకొచ్చారు. మరి ఈ విధానాన్ని భారత్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు? అనే సందేహాలకు సమాధానం వచ్చేసింది. నెల వ్యవధిలోనే భారత్‌లో బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్‌పై ఛార్జీల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ‘ట్విటర్ బ్లూ’ను భారత్‌లో ఎప్పుడు మొదలుపెడుతున్నారు?’ అంటూ ప్రభు అనే ట్విటర్ యూజర్ ప్రశ్నించగా.. ఎలాన్ మస్క్ పైవిధంగా సమాధానమిచ్చారు. ‘నెల లోపలే అనుకుంటున్నా’ అని మస్క్ క్లారిటీ ఇచ్చారు. దీంతో భారత్‌లో ప్రీమియం సర్వీసులు ఎప్పటి నుంచి ఆరంభమవబోతున్నాయనేదానిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

కాగా బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్‌పై సబ్‌స్ర్కిప్షన్ ఫీజు కింద 8 డాలర్లు వసూలు చేయబోతున్న ట్విటర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ కొత్త వేరిఫికేషన్ విధానం ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే దేశాల్లోని ఐఫోన్లపై మాత్రమే అందుబాటులో తీసుకొచ్చారు. క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-06T11:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising