ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Musk-Twitter: మరో షాకిచ్చిన మస్క్.. ఉద్యోగులకు దిమ్మతిరిగేలా తొలి ఈ-మెయిల్

ABN, First Publish Date - 2022-11-10T17:38:08+05:30

‘వర్క్ ఫ్రం హోం’ సౌలభ్యానికి ముగింపు పలికినట్టు ట్విటర్ ఉద్యోగులకు ఈమెయిల్ పంపిన ఎలాన్ మస్క్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ట్విటర్‌లో(Twitter) ఉద్యోగుల తొలగింపు పర్వం ముగిశాక.. సంస్థ అధినేత ఎలాన్ మస్క్(Elon musk) మిగిలిన సిబ్బందికి తొలి ఈ మెయిల్ పంపించారు. రాబోయేవి గడ్డు రోజులంటూ వారిని హెచ్చరించారు. అంతేకాకుండా.. వర్క్ ఫ్రం హోం(Work from home) సౌలభ్యానికి ముంగింపు పలుకుతున్నట్టు కూడా తేల్చి చెప్పారు. ఉద్యోగులందరూ ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తాను అనుమతిస్తే తప్ప ఎవరికీ వర్క్ ఫ్రం హోం అవకాశం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని మస్క్ తన ఈమెయిల్‌లో చెప్పేశారు. ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడే ట్విటర్‌కు రాబోయేవి గడ్డు రోజులేనని స్పష్టం చేశారు.

కాగా.. మస్క్ సారథ్యంలో ట్విటర్‌లో గత పద్నాలుగు రోజులుగా పలు కీలక మార్పులు జరిగాయి. సిబ్బందిలో దాదాపు 50 శాతం మందిని మస్క్ తొలగించారు. అంతేకాకుండా.. బ్లూటిక్ ద్వారా యూజర్ వెరిఫికేషన్ కావాలనుకునే వారు నెలకు 8 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలన్న నిబంధన విధించారు. ఫేక్ అకౌంట్లపై కూడా ఉక్కుపాదం మోపారు. ట్విటర్ ఆదాయంలో సగం సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా సమకూరేలా చర్యలు తీసుకోవాలని ఆయన తన తాజా ఈమెయిల్‌లో ఉద్యోగులకు తెలిపారు.

మరోవైపు.. మస్క్ రాకతో పలువురు సెలబ్రిటీలు ట్విటర్‌ను వీడారు. మస్క్‌ రాకతో ట్విటర్‌.. ద్వేషం, అసహనానికి నెలవుగా మారొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సంప్రదాయవాదులైన రిపబ్లికన్లకు ఓటు వేయాలని మస్క్ బహిరంగంగా పిలుపునివ్వడం కూడా సంచలనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో అమెరికాలో మరో మైక్రోబ్లాగింగ్ వేదిక మాస్టొడాన్‌కు(Mastodon) డిమాండ్ విపరీతంగా పెరిగింది. ట్విటర్‌ను వీడుతున్న అనేక మంది అందులో చేరిపోతున్నారు.

ఇదీ చదవండి: ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఈ రంగు దుస్తులనే ధరిస్తారు.. ఎందుకో తెలిస్తే..

Updated Date - 2022-11-10T18:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising