ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Layoffs: గూగుల్‌లో కొత్త సిస్టమ్.. తేడా వస్తే ఉద్యోగుల పని అంతేసంగతులు!

ABN, First Publish Date - 2022-12-28T16:53:55+05:30

ముగింపునకు చేరువైన 2022లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రంగాల్లో ఐటీ సెక్టార్ (IT Sector) ప్రధానమైనది. మార్కెట్‌లో డిమాండ్ లేమి కారణంగా అప్రమత్తమైన ఐటీ కంపెనీలు (IT companies) వ్యయాల తగ్గింపునకు కీలక చర్యలు తీసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముగింపునకు చేరువైన సంవత్సరం 2022లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రంగాల్లో ఐటీ సెక్టార్ (IT Sector) ప్రధానమైనది. మార్కెట్‌లో డిమాండ్ లేమి కారణంగా అప్రమత్తమైన ఐటీ కంపెనీలు (IT companies) వ్యయాల తగ్గింపునకు కీలక చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన (LayOffs) పలికాయి. ఎంప్లాయీస్‌పై తొలగింపు వేటు వేసిన కంపెనీల జాబితాలో ట్విటర్ (Twitter), మెటా(META), అమెజాన్‌(Amazon)తోపాటు పలు దిగ్గజ ఐటీ కంపెనీలున్నాయి. అందుకే 2022 సంవత్సరం ఐటీ ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురిచేసింది. అయితే నూతన ఏడాది 2023లోనూ దాదాపు ఇదే ఒరవడి అనివార్యమని, ఉద్యోగుల తొలగింపులు కొనసాగే అవకాశముందని పలు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. టెక్ దిగ్గజాలైన గూగుల్ (Google), అమెజాన్ (Amazon) వచ్చే ఏడాది వేలాదిమంది తొలగింపునకు సిద్ధమవుతున్నాయని పేర్కొంటున్న పలు రిపోర్టులు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

తొలగింపు పక్రియలో భాగంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కొత్తగా రూపొందించిన ఫెర్ఫార్మెన్స్ రేటింగ్ సిస్టమ్‌ ‘జీఆర్ఏడీ’ను (Google Reviews and Development) అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఉద్యోగుల ఉద్వాసన పక్రియలో ఈ వ్యవస్థ సాయం తీసుకోనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టీమ్‌లో తక్కువ ప్రదర్శనను స్కోరు ఆధారంగా గుర్తించనున్నారని, నెలల వ్యవధిలోనే చేపట్టనున్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఇది దోహదపడుతుందని కంపెనీ భావిస్తోందట. ఫెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో తక్కువ స్కోరు సాధించిన ఉద్యోగులకు తొలగింపు ముప్పు ఎక్కువగా ఉండనుంది. ఈ రిపోర్టులు గూగుల్ ఉద్యోగులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. కాగా గూగుల్ సుమారు 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతోందని గతంలో పలు రిపోర్టులు పేర్కొన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఉద్యోగుల తొలగింపుపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికే రేటింగ్ సిస్టమ్ పరిశీలనలో ఉండడంతో 2023లో సమీక్ష ప్రక్రియ మొదలవనుందని సీఎన్‌బీసీ (CNBC) తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలోనే ఈ ప్రక్రియ ఉండొచ్చని పేర్కొంది. ఫర్ఫార్మెన్స్ సిస్టమ్ ఆధారంగా గూగుల్ ఉద్యోగుల్లో దాదాపు 6 శాతం మంది ప్రదర్శన తక్కువగా ఉండొచ్చని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ రిపోర్టులకు బలం చేకూర్చుతూ అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 2022 ఆరంభం నుంచి ప్రొడక్టివిటీ పెంచాలని ఉద్యోగులను హెచ్చరిస్తూ వచ్చారు. ఇటివల నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ ఈ మేరకు హెచ్చరించారని సమాచారం. ఇక ఎంతమందిపై గూగుల్ వేటు వేయనుందనే విషయం తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-12-28T17:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising