Earn money: ఇంటి దగ్గరే ఉండి నెలకు రూ.70 వేల వరకు సంపాదించే ఐడియా ఇదీ..
ABN, First Publish Date - 2022-11-17T18:07:12+05:30
ఇంటి వద్దే ఉండి డబ్బు సంపాదించడం (earn money at home) ఎలా అని మీరెప్పుడైనా ఆలోచించారా?.. అనువైన ఐడియా ఏమీరాక ప్రయత్నాన్ని పక్కనపెట్టేశారా ?..
ఇంటి వద్దే ఉండి డబ్బు సంపాదించడం (earn money at home) ఎలా అని మీరెప్పుడైనా ఆలోచించారా?.. అనువైన ఐడియా ఏమీరాక ప్రయత్నాన్ని పక్కనపెట్టేశారా ?.. అయితే వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో (Investment) నెలకు రూ.70 వేల వరకు సంపాదించే ఆదాయమార్గం (money) ఒకటి ఉంది. ఏటీఎం మెషిన్లు ఏర్పాటు, వాటి ఫ్రాంచైజీల ద్వారా ప్రతి నెలా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. సులభంగా, వేగంగా నగదు ఉపసంహరణ సౌలభ్యం కోసం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా దాదాపు బ్యాంకులన్నీ ఏటీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ఆ ఏటీఎంలను బ్యాంకులే ఇన్‌స్టాల్ చేస్తాయని చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఏటీఎంలను థర్డ్‌పార్టీలు ఏర్పాటు చేస్తాయి. దేశంలో మెజారిటీ బ్యాంకులు ‘టాటా ఇండిక్యాష్’, ముత్తూట్ ఏటీఎం, ఇండియా వన్ ఏటీఎం కంపెనీల సహకారంతోనే ఏటీఎంలను ఇన్‌స్టాల్ చేస్తున్నాయి. కాబట్టి ఏటీఎం నిర్వహణపై ఆదాయాన్ని పొందాలనుకునే వ్యక్తులు సంబంధిత థర్డ్‌పార్టీ కంపెనీలకు వాటి వెబ్‌సైట్లపై దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్ అప్ (sign up) అయ్యి ఏటీఎం ఫ్రాంచైజీలలో పనిచేయవచ్చు.
కాగా ఈ స్కీమ్‌లోకి దిగాలనుకునే వ్యక్తులు దాదాపు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.2 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.3 లక్షలు తీసుకుంటారు. ఏటీఎం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లావాదేవీలు మొదలైతే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.8 పొందొచ్చు. ఇక బ్యాలెన్స్ చెక్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ప్రతి నాన్-క్యాష్ లావాదేవీపై రూ.2 చొప్పున లభిస్తుంది.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
- ఐడీ ప్రూఫ్- ఆధార్ కార్డ్, పాన్‌కార్డ్, ఓటర్ కార్డ్
- అడ్రస్ ప్రూఫ్- రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్
- బ్యాంకు అకౌంట్, పాస్‌బుక్.
- ఫొటోగ్రాఫ్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్.
- ఇతర ధృవీకరణపత్రాలు/కంపెనీ కోరినవన్నీ.
- జీఎస్టీ నంబర్.
- కంపెనీ కోరిన ఫైనాన్సియల్ డాక్యుమెంట్లు సమర్పించాలి.
కాగా దరఖాస్తు చేసుకునే వ్యక్తులు అర్హత సాధించాలంటే కనీసం 50-80 చదరపు అడుగుల స్థలాన్ని కలిగివుండాలి. అది కూడా ఇతర ఏటీఎంల నుంచి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. సాధారణ ప్రజలకు సులభంగా కనిపించేలా ఉండాలి. కనీసం 1కిలోవాట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌తో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉండాలి. అయితే కస్టమర్లు తమకు అనువైతేనే ఈ ఐడియాను పరిశీలించాలి. పెట్టుబడి పెట్టేముందు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.
Updated Date - 2022-11-17T20:40:15+05:30 IST