AP ప్రైవేట్ వైద్య కళాశాలల్లో MBBS, BDS
ABN, First Publish Date - 2022-10-29T15:25:12+05:30
విజయవాడలోని డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్) - ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి
విజయవాడలోని డా.ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్) - ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్విమ్స్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలోని ఎన్‌ఆర్‌ఐ కేటగిరీ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2022 స్కోర్, కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(బోటనీ, జువాలజీ)/బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ సబ్జెక్ట్‌లలో జనరల్ అభ్యర్థులకు కనీసం 50 శాతం; జనరల్ కేటగిరి దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
నీట్ కటాఫ్ స్కోర్: మొత్తం 720 మార్కులకుగాను జనరల్, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 117; జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ దివ్యాంగులకు 105; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 93 మార్కులను కటాఫ్ స్కోర్‌గా నిర్దేశించారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.10,620
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31
వెబ్‌సైట్: ntruhs.ap.nic.in
Updated Date - 2022-10-29T15:30:32+05:30 IST