ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Assembly Elections: తొలి విడతలో 65 శాతం పోలింగ్ నమోదు

ABN, First Publish Date - 2022-12-01T17:18:31+05:30

గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly Elections) తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది.

Gujarat Assembly Elections
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly Elections) తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ (First Phase Pollling) జరిగింది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.39 కోట్లు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు 14,382 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

2017లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చి 40 స్థానాలను గెలుచుకోగా.. స్వతంత్రుడు ఒక చోట గెలిచారు. బీజేపీ, కాంగ్రెస్‌ 89 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా.. ఆప్‌ 88 చోట్ల బరిలోకి దిగింది. మొత్తం 39 పార్టీలు బరిలో నిలిచాయి. 339 మంది స్వతంత్రులు కూడా పోటీచేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మధ్య గుజరాత్‌ ప్రాంతం బీజేపీకి కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆదుకుని బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చింది ఈ ప్రాంతమే. ఇక్కడ మొత్తం 61 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే 182 స్థానాల అసెంబ్లీలో మూడో వంతు సీట్లు అన్న మాట. 2017లో బీజేపీకి మొత్తం 99 స్థానాలు రాగా.. అత్యధికంగా 37 మధ్య గుజరాత్‌లోనే దక్కాయి. ఈ ప్రాంతంలో కాంగ్రె్‌సకు 22 స్థానాలు రాగా.. రెండు సీట్లను స్వతంత్రులు గెలుచుకున్నారు. ఈ సారి మరిన్ని సీట్లపై బీజేపీ కన్నేసింది.

ఐదో తేదీన రెండో విడతలో మధ్య గుజరాత్‌ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలు.. దాహోద్‌, పంచ్‌మహల్‌, వడోదరా, ఖేడా, మహిసాగర్‌, ఆనంద్‌, అహ్మదాబాద్‌, చోటా ఉదయ్‌పూర్‌లోని స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అహ్మదాబాద్‌ జిల్లాలో 21 స్థానాలు ఉండగా.. 2017లో బీజేపీ 15 గెలుచుకుంది. వడోదరా జిల్లాలో పదికి ఎనిమిది దక్కాయి. ఈ ప్రాంతంలో మొత్తం 10 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఇంకో ఐదారు చోట్ల కూడా గిరిజనుల ప్రాబల్యం ఉంది. ఈ పదింటిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐదు సాధించగా.. బీజేపీ నాలుగు మాత్రమే గెలుచుకుంది.

రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ (BJP) మరోమారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ (Congress) గట్టిపట్టుదలగా ఉంది. ఇక, పంజాబ్‌లానే గుజరాత్‌లోనూ ప్రభంజనం సృష్టించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎదురుచూస్తోంది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి.

Updated Date - 2022-12-01T17:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising