Gujarat Polls : మోదీ పోటీ చేసిన స్థానం నుంచి బరిలో దిగిన అభ్యర్థి... ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం...
ABN, First Publish Date - 2022-12-01T15:53:07+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పశ్చిమ రాజ్‌కోట్ నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక్కడి నుంచి గతంలో నరేంద్ర మోదీ
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పశ్చిమ రాజ్‌కోట్ నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక్కడి నుంచి గతంలో నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పోటీ చేయడంతో నిత్యం వార్తల్లో ఉండేది. ఇప్పుడు ఎటువంటి ఆస్తులు లేని భూపేంద్ర పటోలియా (Bhupendra Patolia) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.
భూపేంద్ర పటోలియా (75) ఈ ఎన్నికల్లో రాజ్‌కోట్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఎటువంటి ఆస్తులు లేవని ప్రకటించారు. వెల్లడించడానికి తనకు ఆదాయం లేదన్నారు. తన బ్యాంకు ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపారు.
పేదవారు కాకపోయినప్పటికీ ఆస్తులు శూన్యమని ఎలా చెబుతున్నారని మీడియా ప్రశ్నించినపుడు పటోలియా స్పందిస్తూ, తనకు ఎటువంటి ఆస్తి లేదని చెప్పారు. ఆస్తి తన కుమారునికి చెందినదని తెలిపారు. పదిహేనేళ్ళ క్రితం తాను పదవీ విరమణ చేసినట్లు తెలిపారు. తాను కేవలం పింఛనుపై ఆధారపడి మాత్రమే జీవిస్తున్నానని, ఆ సొమ్మును వెల్లడించవలసిన అవసరం లేదని చెప్పారు.
పాటిదార్ సామాజిక వర్గానికి చెందిన పటోలియా మాట్లాడుతూ, ‘‘నువ్వు ఎన్నికల్లో పోటీ చేయలేవు’’ అని ఓ బీజేపీ కార్యకర్త తనతో అన్నాడని, అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. తాను గెలిస్తే, ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.
ప్రచారం చేయడానికి తన వద్ద డబ్బులు లేవని, అయితే తన కుటుంబం మద్దతు ఉంటుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయడానికి స్నేహితుల సహకారం కోరాలని భావిస్తున్నానని చెప్పారు. డిపాజిట్ కోల్పోబోనని ఆశిస్తున్నానని చెప్పారు. ఆయన ప్రచారానికి తాము సహకరిస్తామని ఆయన స్నేహితులు చెప్పారు.
Updated Date - 2022-12-01T16:46:16+05:30 IST