ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Results : మీకేమైనా సందేహమా? 135-145 స్థానాలు మావే : హార్దిక్ పటేల్

ABN, First Publish Date - 2022-12-08T10:21:33+05:30

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్

Hardik Patel
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ గతం కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 182 స్థానాలకుగానూ 151 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో బీజేపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.

ఈ నేపథ్యంలో పాటిదార్ నేత, వీరంగమ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్‌లో ప్రభుత్వాన్ని తమ పార్టీ కచ్చితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. ‘‘మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? మాకు 135-145 స్థానాలు వస్తాయి’’ అని చెప్పారు. తాము చేసిన మంచి పనుల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 2002 నుంచి అధికారంలో ఉన్నందువల్ల తమ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. రాష్ట్రంలో గడచిన ఇరవయ్యేళ్ళలో అల్లర్లు, ఘర్షణలు, ఉగ్రవాద దాడులు వంటివేవీ జరగలేదన్నారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పరిపాలిస్తోందని ప్రజలకు తెలుసునని చెప్పారు.

వరుసగా ఏడుసార్లు విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సీపీఎంకు మొదట దక్కింది. 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్ళపాటు పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం పరిపాలించింది. వరుసగా ఏడుసార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు బీజేపీ గుజరాత్‌లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీపీఎం రికార్డును సమం చేస్తుంది. 2002లో గుజరాత్‌లో బీజేపీ 127 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-12-08T10:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising