MLA Etala: వామపక్షాలు లేకపోతే టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు...
ABN, First Publish Date - 2022-11-06T14:45:00+05:30
మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, నైతికంగా బీజేపీ గెలిచిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, నైతికంగా బీజేపీ గెలిచిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇంతలా ప్రలోభపెట్టిన టిఆర్ఎస్‌కు ఆదరణ లేదని, వామపక్షాలు లేకపోతే టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఈటల పేర్కొన్నారు.
ఫలితాల వెల్లడిలో జాప్యంపై అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే ఈటల అన్నారు. టీఆర్‌ఎస్ ఓడితే పెన్షన్లు రద్దు అవుతాయని మంత్రులు బెదిరించారని, మంత్రులు పాలన వదిలి మునుగోడులో ఉన్నారని ఆరోపించారు. ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. పోలింగ్ సిబ్బందిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని, సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మార్వో, ఎండీవోలతో మాట్లాడే స్థాయికి దిగజారారని విమర్శించారు. పోలింగ్ ముగిసినా టీఆర్‌ఎస్ నేతలు మునుగోడులోనే ఉన్నారని, మునుగోడు ప్రజాస్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Updated Date - 2022-11-06T15:11:56+05:30 IST