ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాదుకుంటారా?.. సంపుకుంటారా?

ABN, First Publish Date - 2022-10-22T19:20:59+05:30

‘‘తెలంగాణ యువత, ప్రజల భవిష్యత్‌ మీ చేతుల్లోనే ఉంది.. వాళ్లను సాదుకుంటారా..? సంపుకుంటారా..? ఆలోచించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరారు. మునుగోడు ఉప ఎన్నిక స్థానికుల కోసం కాదని తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కోసం వచ్చిన ఎన్నిక అని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ‘‘తెలంగాణ యువత, ప్రజల భవిష్యత్‌ మీ చేతుల్లోనే ఉంది.. వాళ్లను సాదుకుంటారా..? సంపుకుంటారా..? ఆలోచించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరారు. మునుగోడు ఉప ఎన్నిక స్థానికుల కోసం కాదని తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కోసం వచ్చిన ఎన్నిక అని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో శుక్రవారం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. గొర్రెల కాపరులకు రావాల్సిన డబ్బులు నిలిపివేయాలని తాను లేఖ రాశానని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంస్థాన్‌ నారాయణపురం శివాలయం సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని, సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రావాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ కుటుంబానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కట్టప్పలని.. కట్టు బానిసలుగా మారారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బతికున్న వారికి సమాధులు కట్టడం టీఆర్‌ఎస్‌ దిగజారిన నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చల్మెడ, కోతులారం, ఇప్పర్తి గ్రామాల్లో కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్‌, దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలవలేదని అన్నారు. మునుగోడులో రూ.వేల కోట్లు పెట్టి సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీలను కొని గెలుస్తానని టీఆర్‌ఎస్‌ అనుకుంటోందని.. కానీ నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. ముఖ్యమంత్రి ఒక గ్రామస్థాయిలో బూత్‌కి ఇన్‌చార్జిగా ఉన్నాడంటే టీఆర్‌ఎస్‌ ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోందన్నారు. రిటర్నింగ్‌ అధికారితో కుమ్మక్కై గుర్తులు కేటాయించకుండా చేశారని, ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టాలని టీఆర్‌ఎస్‌ అనుకున్నా కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామాన్ని కాపాడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్‌ను ఎన్నిసార్లు బొంద పెట్టాలి: లక్ష్మణ్‌తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హమీని అమలు చేయని సీఎం కేసీఆర్‌ను ఎన్నిసార్లు బొందపెట్టాలని ఎంపీ కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయకులు జేపీ నడ్డాకు సమాధి కట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము ఎన్నోసార్లు నిరసనలు తెలిపామని.. టీఆర్‌ఎస్‌ నాయకుల మాదిరిగా తాము సమాధులు కట్టాలంటే సీఎం కేసీఆర్‌కు ఎన్నిసార్లు కట్టాలని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా నిలిచిందని, త్వరలోనే ఫలితం చూస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. పార్లమెంట్‌ ప్రవాసీ యోజనలో భాగంగా సైదాబాద్‌ వినయ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లోదివ్యాంగులతో మంత్రి సమావేశం నిర్వహించారు. దివ్యాంగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జోషి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి జిల్లాలో జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ వెంటనే నడ్డాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ఫ్ల్లోరోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు భూమి కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు.

రఘునందన్‌రావును అడ్డుకున్న స్థానికులు..మూడున్నరేళ్లుగా రాజగోపాల్‌రెడ్డి తమ ఊరిని పట్టించుకోలేదని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామస్థులు ఎమ్మెల్యే రఘునందన్‌రావును నిలదీశారు. ప్రచారం కోసం శుక్రవారం గ్రామానికి వచ్చిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. మోదీకి, రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆందోళనకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వినలేదు.

Updated Date - 2022-10-23T20:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising