Munugodu by poll: తులం బంగారం ఇవ్వకుంటే ఓటేయం...
ABN, First Publish Date - 2022-11-02T13:10:51+05:30
జిల్లాలోని మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఓటర్లు ఆందోళనకు దిగారు.
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు ఎన్నికల జరుగనుండగా ఈరోజు బీజేపీ (BJP)కి ఓటర్లు షాక్ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఓటర్లకు తులం బంగారం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే తమకు బంగారం ఇవ్వకుండా మూడు వేలు మాత్రమే ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఓటర్లు నిలదీశారు. జిల్లాలోని మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పి రూ.3 వేలు మాత్రమే ఇచ్చారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి బీజేపీకి చెందిన కార్యకర్తను ఓటర్లు నిలదీశారు. తులం బంగారం ఇవ్వకుంటే ఓటు వేయబోమని హెచ్చరించారు. ఓటర్లు ఊరు ఊరంతా ఏకమై నేతలపై తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓటర్లకు సర్ది చెప్పలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు.
మరోచోట కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మునుగోడు మండలం కొరటికల్‌లో బీజేపీ నాయకుల ఇంటి వద్ద గ్రామస్తులు గొడవకు దిగారు. ఆశించిన డబ్బు ఇవ్వడంలేదంటూ బీజేపీ నేతలను గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో బీజేపీ నేతలు ఉండిపోయారు.
Updated Date - 2022-11-02T14:48:43+05:30 IST